మాతృశ్రీనగర్ మెడికేర్ లో అరుదైన శస్త్రచికిత్స

  • మహిళ మెదడులోంచి 6×6 సెం.మీ కణతి తొలగింపు

నమస్తే శేరిలింగంపల్లి: కొంత కాలంగా తరుచూ ఓ మహిళ తలనొప్పి, వాంతులు, సరిగా కనబడకపోవడం వంటి ఆరోగ్య సమస్యలతో నిత్యం ఇబ్బందులు పడింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి ఆపరేషన్ కూడా చేయించుకుంది. కానీ పరిస్థితిలో కొంచెం కూడా మార్పు రాలేదు. మళ్లీ అదే సమస్య వేధించసాగింది. ఇటీవల మరో ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఆ మహిళకు పునర్జన్మను ప్రసాదించారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. బోరబండ ప్రాంతానికి చెందిన విజయ (40) కొంత కాలంగా తరుచూ తలనొప్పి, వాంతులు, సరిగా కనబడకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడింది. స్థానికంగా ప్రయివేట్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు సర్జరీ చేశారు.

మేడికేర్ వైద్యులు తొలగిస్తున్న కణతి

ప్రయోజనం లేకపోవటంతో మియాపూర్ మాతృశ్రీ నగర్ మెడికేర్ ఆస్పత్రిని సంప్రదించగా .. అక్కడి వైద్యులు పరీక్షించి గ్లయో బ్లాస్టోమ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి, క్రిటికల్ కేర్ డాక్టర్ ప్రసాద్, అనస్తీషియా డాక్టర్ హరికృష్ణలు రోగిని పరిశీలించి ఆమె మెదడులో 6.6 సెంటీమీటర్లు( మెదడులో నాలుగవ వంతు భాగం) కణతి ఉన్నట్లు నిర్దారించారు. సుమారు 5 నుండి 6 గంటల పాటు శ్రమించి ఆ కణతిని తొలగించారు. ప్రస్తుతం పేషేంట్ విజయ ఆరోగ్యంగా ఉందని మెడికేర్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ రాజు తెలిపారు. తక్కువ ఖర్చుతో అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తున్నామని, కార్పొరేట్ ఆస్పత్రి అయినా అందరికీ అందుబాటు ధరల్లో వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పేషేంట్ విజయ, డాక్టర్ల బృందం పాల్గొన్నారు.

శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న మాతృశ్రీనగర్ మెడికేర్ వైద్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here