వేడుకగా సామూహిక కళ్యాణోత్సవం, మహాపుష్ప యాగం

నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి జన్మ నక్షత్ర శ్రవణా నక్షత్రం సందర్భముగా సామూహిక కళ్యాణోత్సవం, మహాపుష్ప యాగం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీవారికి పంచామృతాభిషేకం, విశేషాలంకారం, సాముహిక శ్రవణా నక్షత్రకళ్యాణోత్సవం, ప్రధాన హోమములు, మహాపుష్పయాగం, పుర్ణాహుతి, హారతి తీర్ధప్రసాదములు మధ్యాహ్నం 12:30 గంటలకు పండిత సత్కారము, దాతలకు సన్మానము, 1 గంటకు అన్నప్రసాద వితరణ జరిగింది. చందానగర్ వాసులు పి. వెంకట దుర్గా మహేశ్వరరావు, కనకదుర్గల కుమారుడు ఫణీంద్రకుమార్ శ్రీజలు స్వామివారికి విశేష పుష్పాలంకారణ, మహాపుష్పయాగం, అన్నప్రసాద వితరణ చేయించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో చేపట్టాలనుకుంటే రూ. 3116/- లు చెల్లించి పాల్గొనవచ్చని భక్తులకు దేవాలయ కమిటీ తెలిపింది.

స్వామివారికి మహాపుష్ప యాగం నిర్వహిస్తున్న ఆలయ పూజారులు
మహాపుష్ప యాగాన్ని తిలకిస్తున్న భక్తులు
మంత్రోత్సవాల నడుమ హోమం నిర్వహిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here