సైబరాబాద్ పరిధిలో ‘భారత్ జోడో’ యాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

  • ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు అమలు
  • వాహనదారులు సహకరించాలని సైబరాబాద్ పోలీసుల విజ్ఞప్తి

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్‌ ట్రాఫిక్ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం “భారత్ జోడో యాత్ర” (పాదయాత్ర) సందర్బంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా దారి మళ్లింపు, పాక్షిక మార్పులు చేపట్టారు సైబరాబాద్ పోలీసులు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

  • భారత్ జోడో యాత్ర IDL లేక్ జంక్షన్ దాటే వరకు అంబేద్కర్ వై జంక్షన్ మూసివేయనున్నారు. బాలానగర్ నుండి కూకట్‌పల్లి వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు.
  • బాలానగర్ నుండి ఎర్రగడ్డ వైపుగా వచ్చే వాహనాలను ( మూసాపేట్ జంక్షన్ వయా చిత్తారామ దేవాలయం (GHMC ఆఫీస్ మూసాపేట్) – ఆంజనేయనగర్ ఎక్స్ రోడ్ – రెయిన్బో విస్టా – ఖైత్లాపూర్ జంక్షన్ – KPHB 4వ ఫేజ్ – RUB హైటెక్ సిటీ – హిందూ ప్రాజెక్ట్ – పైప్‌లైన్ రోడ్ ) BHEL మీదుగా దారి మళ్లించనున్నారు.
  • భారత్ జోడో యాత్ర కూకట్ పల్లి idl తర్వాత అంబేద్కర్ వై జంక్షన్ తెరవనున్నారు. బాలానగర్ నుండి వచ్చే వాహనాలను IDL లేక్ జంక్షన్ అక్కడినుంచి వయా భేల్ – రెయిన్‌బో విస్టా – ఖైత్లాపూర్ జంక్షన్ – KPHB 4వ ఫేజ్ – RUB హైటెక్ సిటీ – హిందూ ప్రాజెక్ట్ – మహీంద్రా అశ్విత – పైప్‌లైన్ రోడ్ కు మళ్లించనున్నారు.
  • భారత్ జోడో యాత్ర JNTU జంక్షన్ దాటిన తర్వాత, IDL జంక్షన్ ఓపెన్ చేసి బాలానగర్ & కూకట్‌పల్లి నుండి వచ్చే వాహనాలను JNTU జంక్షన్ వద్ద భేల్ దిశగా.. ఫోరమ్ మాల్ ఫ్లైఓవర్ – RUB హైటెక్ సిటీ – హిందూ ప్రాజెక్ట్ – మహీంద్రా అశ్విత – పైప్‌లైన్ రోడ్ వైపు మళ్లించనున్నారు.
  • కూకట్‌పల్లి నుంచి నిజాంపేట్, ప్రగతినగర్ వైపు వచ్చే వాహనాలను JNTU వయా ఫోరమ్ మాల్ అండర్ బ్రిడ్జి మీదుగా KPHB 9వ ఫేజ్ – వసంత్ నగర్ -హైదర్ నగర్ యు టర్న్ – నిజాంపేట్ – ప్రగతినగర్ దిశగా మళ్లించనున్నారు.
  • పైప్‌లైన్ రహదారిని మూసివేయనుండటంతో చందానగర్ నుండి మూసాపేట్ వచ్చే వాహనాలకు అనుమతి నిరాకరించారు. అయితే దారిలో ఒకవైపు నుంచే (మూసాపేట నుంచి చందానగర్ వైపు వచ్చే) వాహనాలు వెళ్లేలా చేయనున్నారు.
  • కొండాపూర్ నుండి ఆల్విన్ జంక్షన్ మీదుగా BHEL వైపు వెళ్లే వాహనాలను హఫీజ్‌పేట ఫ్లైఓవర్ కింద నుంచి సాయిరాం టవర్స్ మంజీరా రోడ్డు మీదుగా బీహెచ్ఈఎల్ వైపు మళ్లించారు
  •  కొండాపూర్ నుండి పైప్‌లైన్ రోడ్డు మీదుగా మూసాపేట్ వైపు వెళ్లే వాహనాాాలనున
    సాయిరాం టవర్స్ యు టర్న్ వద్ద దారి మళ్లించారు – హఫీజ్‌పేట ఫ్లై ఓవర్ – RTO ఆఫీస్ జంక్షన్ –
    ఎడమ మలుపు – హిందూ ప్రాజెక్ట్ – RUB హైటెక్ సిటీ – ఖైత్లాపూర్ – రెయిన్బో విస్టా వీదుగా మూసాపేట్ వైపు మళ్లించారు
  • NH-65 రోడ్డులో BHEL జంక్షన్ నుండి పటాన్చెరు వైపు వెళ్లే వాహనాలను ఒక రోడ్డులో రెండు భాగాలుగా విభజించి అనుమతించనున్నారు.

ప్రయాణికులు నిర్ధారించుకోవడానికి పై సలహాను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు.
ట్రాఫిక్ సజావుగా సాగి, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని పోలీసులు అభ్యర్థించారు.

సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ దారి మళ్లింపులకు సంభందించిన మ్యాప్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here