- బంగారు పతకాలు సాధించిన ముజాహిద్, ప్రభు కుమార్
- హర్ష వర్ధన్ గౌడ్, ఎప్షిత లకు రజతం
- కాంస్యంతో మెరిసిన నాగేంద్ర, చంద్రశేఖర్
- విజేతలకు జడ్సీ, డీసి అభినందనలు
నమస్తే శేరిలింగంపల్లి : న్యూ ఢిల్లీ తాల్ కటోరా ఇండోర్ స్టేడియంలో నవంబర్ 6న నిర్వహించిన 2వ WAKO ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ లో చందానగర్ పీజేఆర్ స్టేడియం క్రీడాకారులు తమ ప్రతిభ చాటారు. కోచ్ ముజాహిద్, ప్రభు కుమార్ లు టోర్నమెంట్ లో సత్తా చాటి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. హర్ష వర్ధన్ గౌడ్, ఎప్షిత లు రజత పతకాలతో రాణించారు. నాగేంద్ర, చంద్రశేఖర్ లు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య, చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ సుధాంశు నందగిరి, జోన్ స్పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్, పీజేఆర్ స్టేడియం ఇన్చార్జి వీరానంద్, కిక్ బాక్సింగ్ తెలంగాణ అధ్యక్షుడు సి.రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎం.మహిపాల్ లు విజేతలను అభినందించారు.