సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి: ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

  • కార్పొరేటర్ల ఆత్మీయ సమీక్షా సమావేశంలో కార్పొరేటర్లకు సూచన

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆయా డివిజన్ల లో నెలకొన్న సమస్యలు , వాటి పరిష్కారానికి సమీక్షా సమావేశం నిర్వహించారు. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో జరిగిన సమీక్షా సమావేశాన్ని కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు సాయి బాబా, మాధవరం రంగరావుతో కలిసి నిర్వహించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అకాల వర్షాల ద్వారా కాలనీ లలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులలో ఇలాంటివి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ముంపు ప్రాంతాలను గుర్తించి, ముంపుకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలను చేపట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని వారికి సూచించారు.

కార్పొరేటర్ల ఆత్మీయ సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

అకాల వర్షాలకు ఏర్పడిన ఇబ్బందుల ను అధికారుల సహాయం తో తొలగించాలని, ప్రజలకు మనో ధైర్యం కలిపిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదిల్ పటేల్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here