- పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలో సాజిద్ ఆధ్వర్యంలో దవాత్- ఏ – ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ సుఖ సంతోషాలను అందించాలని అభిలషించారు. ఆధ్యాత్మిక దైవ ప్రార్ధనలతో శాంతి, సోదరభావం, సౌభ్రాతృత్వానికి రంజాన్ ప్రతీక అని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్వర్ షరీఫ్, ప్రవీణ్ ,అక్బర్ ఖాన్, మంత్రి ప్రగడ సత్యనారాయణ, అంజద్ పాషా, భగత్, మరియు మహమ్మద్ మొహినుద్దీన్, జిలాని, సుభాని, నయీమ్ , ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.