- బిజెవైఎం బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తా
నమస్తే శేరిలింగపల్లి : బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా చందానగర్ కాంటెస్టెడ్ కార్పోరేటర్, యువమోర్చా రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సింధూరెడ్డి నియమితులయ్యారు. బిజెవైం పూర్తిస్థాయి కమిటీని ప్రకటిస్తూ బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ నియామకాలు చేపట్టారు. ఈ సందర్భంగా కసిరెడ్డి సింధూరెడ్డి మాట్లాడుతూ తనను రాష్ట్ర బిజెవైం ఉపాధ్యక్షురాలిగా నియమించి, పార్టీకి పనిచేసే అవకాశం కల్పించిన రాష్ట్ర రథసారథి గంగాపురం కిషన్ రెడ్డికి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ కి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకముంచి అప్పజెప్పిన బాధ్యతలను నెరవేరుస్తానని, పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
- సింధూరెడ్డి రాజకీయ ప్రస్థానం
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చందానగర్ డివిజన్ బిజెపి అభ్యర్థిగా బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చారు. అనంతరం పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అంతేకాక గత శాసనసభ ఎన్నికల్లోనూ చురుకుగా పని చేశారు. సోషల్ మీడియా ద్వారా పార్టీ ప్రచారాన్ని విస్తృత పరిచి ప్రజలను చైతన్యవంతులను చేశారు. జాతీయపార్టీ పిలుపుమేరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొని తనవంతు బాధ్యతను సక్రమంగా నేరవేర్చి ప్రశంసలు పొందారు.