- ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కొనియాడారు. బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ లో జగ్జీవన్ రాం విగ్రహానికి, డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఆత్మ విశ్వాసమే ఆయుధంగా దళితుల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల కోసం నిత్యం పాటుపడిన మహానుభావుడు, అఖండ భారత ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన స్వతంత్ర సమర యోధుడు అని, ఈతరం ప్రజలకు ఆదర్శప్రాయం ఆయన జీవితమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, ముజీబ్, కైసర్ బాయ్, సమ్మద్ బాయ్, కాజా, మల్లేష్, సాయి, నాగరాజు, సలీం, వెంకటేష్, నాగభూషణం, కలీం, ప్రదీప్ రెడ్డి, రవి, సంగారెడ్డి, సావిత్ర, గణిత, నస్రీన్ పాల్గొన్నారు.