మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అభినందనీయం

  • సాయి వైభవ్ కాలనీలో ఘనంగా హరిత వైభవోత్సవం
  • మొక్కలు నాటి కాలనీ ప్రెసిడెంట్, కాలనీవాసులను ప్రశంసించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలో సాయి వైభవ్ కాలనీలో ఆ కాలనీ ప్రెసిడెంట్ పద్మావతి ఆధ్వర్యంలో హరిత వైభవోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సాయి వైభవ్ కాలనీలో హరిత వైభవోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం సంతోషకరమైన విషయమన్నారు.

సాయి వైభవ్ కాలనీలో ఆ కాలనీ ప్రెసిడెంట్ పద్మావతి ఆధ్వర్యంలో హరిత వైభవోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

సాయి వైభవ్ కాలనీ ఇక నుండి హరిత వైభవోత్సవంగా విరాజిల్లునని, ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిచిందని, రాబోయే రోజులలో కాలనీ మొత్తం పచ్చని మణిహారంగా మారునుందని, ఇంటికి, దేవుడికి ఉపయోగపడే అన్ని రకాల మొక్కలు నాటడం జరిగినదని, కాలనీలో ప్రధాన రహదారికిరువైపులా, అంతర్గత రోడ్లలో మొక్కలు నాటాడం జరిగిందన్నారు. కాలనీలో ప్రతి ఒక్కరు భాగసామ్యమై మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడం అభినందనీయమని, ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దోహదపడిన కాలనీ ప్రెసిడెంట్ పద్మావతి, కాలనీ వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హరిత వైభవోత్సవంలో భాగంగా రుద్రాక్ష, జమ్మి, మారేడు, చింత, సంపెంగ, మామిడి, పనస, తెల్ల నేరేడు, వాటర్ ఆపిల్, మల్బరీ, అవకాడో, నిమ్మ, ఉసిరి వంటి పండ్ల జాతుల మొక్కలను పూల జాతుల నాటారు.

మొక్కలు నాటి నీరు పోస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

గత ప్రభుత్వం హయాంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని మణిహారంగా మార్చినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కోట్ల మొక్కలను నాటి సంరక్షించడంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నదని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటుతామని, ఔషధ గుణాలు గల మొక్కలు, పండ్ల జాతుల మొక్కలు నాటి ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటి సంరక్షిస్తామని, హరిత హారంలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచే బాధ్యత తీసుకున్నామని, హరితహారంతో తెలంగాణలో అడవుల శాతం పెరిగినదన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్, శ్యామలేట్ శ్రీనివాస్, నారాయణ, సాయి వైభవ్ కాలనీ ప్రెసిడెంట్ రావి పద్మావతి, సెక్రెటరీ సుజిత్ కృష్ణ, ట్రెజరర్ సరస్వతి, సిద్దార్థ, నవీన్ , పవన్, రాజు, సత్యనారాయణ, శర్మ, వేణు, వంశీ, రవి, వైజయంతి, రమ్య, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here