నమస్తే శేరిలింగంపల్లి : శిల్పరామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రెవ డాన్స్ అకాడమీ గురువు ప్రోటిటి ముఖేర్జీ శిష్య బృందం చేపట్టిన భరతనాట్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.
శివ పంచాక్షరీ స్తోత్రం, నటేశ కౌతం, తీశారా అలరిపు, చక్రవగం జతిస్వరం, దేవా దేవం భజేయఁ , మురుగ వర్ణం, సరస్వతి పుష్పాంజలి, కీర్తనం, కృతి, ధనశ్రీ తిల్లాన మొదలైన అంశాలను కళాకారులూ శాన్వి, షనాయా, సహస్ర తన్వి, సాత్విక , శ్రీకా, వైష్ణవి, వీక్ష, దివ్యా, ఓజస్వినీ, నిత్య, మహి, సాంచి, నేత్ర, ఆకాంక్ష మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.