కమ్మవారి సామాజిక వర్గ ప్రయోజనాలకు తోడ్పడతాం

  • కమ్మ సేవా సంఘాల సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మాణం
  • ముఖ్యఅతిథులుగా పాల్గొన్న కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సి.వి.రావు, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సి.వి.రావు, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధ్యక్షతన అమీర్ పేట లోని సంఘ సమాఖ్య కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అంతకు ముందు ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుకి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్నికవ్వడాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలిపారు.

సంఘ సమాఖ్య కార్యాలయంలో కమ్మవారి సామాజిక ప్రయోజనాల కోసం తీర్మాణాలు చేస్తున్న కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సి.వి.రావు,, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఆ తర్మాత కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య, తెలంగాణ అధ్వర్యంలో వీలైనంత త్వరలో కో- ఆపరేటివ్ బ్యాంకుని స్థాపించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి రుణాలు, వారి పిల్లలకు అవసరమైన విద్యారుణాలు మంజూరు చేసి సామాజిక వర్గ ప్రయోజనాలకు తోడ్పడాలని తీర్మానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కమ్మ సంఘానికి కేటాయించిన ఐదుఎకరాల స్థలానికి ధర ఫైనల్ చేయటం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించి, కోర్టు కేసు ఉపసంహరించుకునేలా చేసి వీలైనంత త్వరలో స్థలంలో నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేశారు.

ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి వెంకటేశ్వర్ రావు, కోశాధికారి డాక్టర్ పునుకొల్లు నాగభూషణం, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here