సంక్షేమ పథకాలే రక్ష  

  • పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ 

నమస్తే శేరిలింగంపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నారని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీ కి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులకు బిఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరగా.. వారికి ప్రభుత్వ విప్ గాంధీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయాలని, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీ ఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు మరియు వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు.

  • బీఆర్ఎస్ పార్టీ లో చేరిన వారిలో ..

ముఖ్య నాయకులు బాలాజీ గౌడ్, శంకర్ ,శాంతప్ప, చిన్నప్ప, అంబాదాసు,నంద కిషోర్, శివ , నయీమ్, జాకీర్ ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here