శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు సంబంధించిన గోడపత్రిక (పోస్టర్) ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 6న జరగనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేయాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభ ప్రాధాన్యతను వివరిస్తూ, సామాజిక న్యాయ సాధనకు ఈ సంకల్ప సభ కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు విష్ణు, కుమార్, అస్లాం, దయానంద్, ప్రవీణ్, యాదగిరి, వలి, స్వామి గౌడ్, సూర్యప్రకాశ్, చందు, అసిఫ్, రాం భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






