శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ సమర్థవంతమైన దర్యాప్తు, పకడ్బందీగా సాక్ష్యాధారాల సేకరణ, అభియోగ శాఖతో సమన్వయం ద్వారా ఈ ఏడాదిలో మొత్తం 10 కీలక క్రిమినల్ కేసుల్లో దోష నిర్ధారణ (Convictions) సాధించింది. వీటిలో మూడు హత్య కేసులు, నాలుగు అత్యాచార కేసులు ఉండటం గమనార్హం. ఈ విజయాలతో శాంతిభద్రతల పరిరక్షణ, బాధితులకు న్యాయం చేయడంలో మియాపూర్ పోలీసులు తమ అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు. దర్యాప్తు అధికారులు చేపట్టిన క్షుణ్ణమైన విచారణ, కోర్టులో పటిష్టమైన సాక్ష్యాధారాల సమర్పణ, కోర్టు డ్యూటీ అధికారులు, లియాజన్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమన్వయ కృషి ఫలితంగానే ఈ తీర్పులు వెలువడ్డాయి.
హత్యలు, అత్యాచారాలు, మహిళలపై నేరాలు, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు జీవిత ఖైదు నుంచి 20 సంవత్సరాల జైలు శిక్షలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, ఒక నెల జైలు శిక్షల వరకు కోర్టులు విధించాయి. ఈ విజయాలు తీవ్రమైన నేరాలపై వేగవంతమైన, శాస్త్రీయ దర్యాప్తు, బాధితులకు సమర్థవంతమైన అభియోగ నిర్వహణ ద్వారా న్యాయం అందించడం, నేర న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడం, నేరస్థులు తప్పకుండా చట్టపరమైన శిక్ష అనుభవిస్తారనే సందేశాన్ని సమాజానికి చేరవేయడంలో మియాపూర్ పోలీసుల నిబద్ధతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ కేసుల్లో విజయవంతమైన దోష నిర్ధారణలు సాధించేందుకు కృషి చేసిన దర్యాప్తు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులు, లియాజన్ అధికారులు, సహాయక సిబ్బందిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఈ ఏడాదిలో మియాపూర్ పోలీస్ స్టేషన్ సాధించిన కీలక దోష నిర్ధారణలు ఇలా ఉన్నాయి. హత్య కేసులు 3, అత్యాచార కేసులు 4, మహిళలపై నేరాల కేసులు 2, రోడ్డు ప్రమాద కేసులు 2 లలో పోలీసులు విజయం సాధించారు.





