ప్రజలు ఎమ్మెల్యే గాంధీకి ఘన విజయం అందిస్తారు: కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు బిఆర్ఎస్ పార్టీపై పూర్తి విశ్వాసం ఉందని ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే గాంధీకి ఘన విజయం అందిస్తారని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు.

చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాస్ నగర్ భవాని నగర్ వికర్ సెక్షన్ కాలనీలో బిఆర్ఏస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలతో కలిసి చందానగర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు, కాలని వాసులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పేద మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కోసం ఆసరా పింఛన్లు, మహిళలకు కేసీఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, గృహలక్ష్మి, బిసి బంధు, దళిత బంధు, వికలాంగుల పింఛన్లు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిడం జరిగిందన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాంధీ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధికి మౌలిక వసతుల కల్పన, అండర్ పాసులు, ప్లైఓవర్స్, లింకు రోడ్లను ఎర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బి ఆర్ స్ పార్టీ అధ్యక్షులు రఘునాధ్ రెడ్డి, కె.రఘుపతిరెడ్డి, పులిపాటి నాగరాజు, బొబ్బ దామోదర్ రెడ్డి, ఓర్సు వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి , వరలక్ష్మి, మల్లిఖార్జున్, మహబూబ్, సుబ్బారావు, మల్లేష్, నరేందర్ బల్లా, రాజశేఖర్, రాహుల్, ఉదయ్, రషీద్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here