శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల డివిజన్ గౌలిదొడ్డి ప్రాంతంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆటో ప్రచారాన్ని సోమవారం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాగం హరిశంకర్ యాదవ్ జెండా ఊపి ఈ ప్రచార వాహనాన్ని ప్రారంభించారు.

సోమవారం నుంచి ఆగస్టు 10 వరకు ఈ అవగాహన ఆటో నల్లగండ్ల డివిజన్‌లోని ప్రతి వీధికి తిరుగుతూ ప్రజలకు SIR కార్యక్రమంపై సమాచారం అందించనుంది. ఈ సందర్భంగా నాయకులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆగస్టు 10లోపు తమ ఓటరు వివరాలను ధ్రువీకరించుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ఇంటింటికీ వచ్చే బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)కు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శంకరి రాజు ముదిరాజ్, ఓ. వెంకటేష్, భీంరాజ్, దర్గుపల్లి పరమేష్, రవికుమార్, రమేష్, సాయిరామ్, సాంబ, వినోద్, అరుణ్, నరసింహ, రాము, పరమేష్, నరేష్, లోకేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





