శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా హఫీజ్‌పేట్ గ్రామానికి చెందిన గీత పారిశ్రామిక సంఘం, గౌడ్ సంఘం సభ్యులు గ్రామంలోని చెరువు కట్టపై ఈత మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంతోపాటు భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా ప్రకృతిని కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బాలింగ్ యాదగిరి గౌడ్, నిమ్మల ప్రభు గౌడ్, శ్రీహరి గౌడ్, భాస్కర్ గౌడ్, కనకమామిడి వెంకటేష్ గౌడ్, నరేందర్ గౌడ్, బాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






