వేడుకగా అన్నపూర్ణ సాయిబాబా ఆలయ ఏకాదశ వార్షికోత్సవాలు

  • ప్రత్యేక పూజల్లో పాల్గొన్న దాతలు, భక్తులు
ప్రత్యేక పూజల్లో ఆలయ కమిటీ సభ్యులు నంది వాడ సుధాకర్, చెన్నారెడ్డి, విద్యాసాగర్, దాతలు

నమస్తే శేరిలింగంపల్లి : అన్నపూర్ణ ఎన్ క్లేవ్ లో బాబా ఏకాదశ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు 108 లీ పాలతో, 108 కలసొదకాలతో అభిషేకం, 11:30 గం లకు పూర్ణాహుతి 12:30 గంటలకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం 6:30 గం లకు రథోత్సవం, రా 8:30 గం లకు అల్పాహారం , సేజ హారతి తో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు మురళిధర శర్మ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా కృపకు పాత్రులు అయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఉత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు నంది వాడ సుధాకర్, చెన్నారెడ్డి, విద్యాసాగర్, జి జైపాల్ రెడ్డి, దాతలు, కాలనీ వాసులు వాసులు భక్తులు పాల్గొన్నారు.

సాయిబాబాకు అభిషేకం చేస్తున్న ప్రధానార్చకులు మురళీధర శర్మ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here