- శంకుస్థాపన చేసిన రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ లోని అతి పురాతనమైన హనుమాన్ మందిరానికి బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ తన సొంత నిధులతో పునర్ వైభవం తెచ్చేందుకు పూనుకున్నారు. అది కొద్ది రోజుల్లోనే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆలయ కమిటీ సభ్యులకు స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో బాలాజీ, రాధా కృష్ణ యాదవ్, గోపాలకృష్ణ, రాజు, రహమతుల్లా, పాల్గొన్నారు.