సగరుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి

  • తెలంగాణ సగర సంగం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ 

నమస్తే శేరిలింగంపల్లి: సగరుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ సగర సంగం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా సగర సంఘం కార్యవర్గ విస్తరణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆత్మగౌరవ భవన స్థలం కేటాయింపు తర్వాత తిరిగి మరో కమ్యూనిటీకి ఇవ్వడం సగర జాతిని అవమానించడమే అవుతుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు అధికారులు కీలకమయ్యారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు చొరవ తీసుకొని ఆత్మగౌరవాన్ని రక్షిస్తూ సగరులకు ముందుగా కేటాయించిన స్థలాన్ని యధావిధిగా కొనసాగించాలని అన్నారు. సగరులను నిర్మాణరంగ కార్మికులుగా గుర్తిస్తూ 59 జీవోను సవరణ చేసి కనీసం 30 శాతం ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో రిజర్వేషన్లు సగరులకు ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న సగర కుల జన గణన మహబూబ్ నగర్ జిల్లాలో నెల రోజులపాటు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా సగర సంఘం అధ్యక్షుడు ప్రనిల్ చందర్ సగర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పూర్తిస్థాయి జిల్లా కమిటీని నియమించుకున్నారు. రాబోయే నెల రోజులలో జనగణన మహబూబ్ నగర్ జిల్లాలో పూర్తి చేస్తామని నూతనంగా ఏర్పడ్డ కార్యవర్గ సమావేశం తీర్మానం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు ఆర్ బి ఆంజనేయులు సగర, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు పెద్దబుద్ధుల సతీష్ సగర, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు పెద్దబూది మహేశ్వరి సగర, ప్రధాన కార్యదర్శి గాండ్ల స్రవంతి సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం సగర, కోశాధికారి నారాయణ సగర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దేవన్న సగర, రాష్ట్ర మహిళా సంఘం ఉపాద్యక్షురాలు అస్కని స్వప్న సగర, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మావతి సగర, రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షులు చంద్రమోహన్ సగర, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు తరుణ్ సగర, జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేశ్ సగర పాల్గొన్నారు.

జిల్లా నూతన కార్యవర్గం.. 

మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా ప్రణీల్ చందర్ సగర, ప్రధాన కార్యదర్శిగా ఉప్పరి సత్యం సగర, కోశాధికారిగా మదిగట్ల నారాయణ సగర లు ముందుగానే ఎన్నిక కాగా శనివారం జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులుగా కృష్ణయ్య సగర, రఘు సగర, శ్రీనివాసులు సగర, సంయుక్త కార్యదర్శులుగా వెంకటయ్య సగర, మణ్యంకొండ సగర, శివప్రసాద్ సగర, కార్యనిర్వాహక కార్యదర్శులుగా సత్యాన్న సగర, శ్రీనివాసులు సగర, ప్రచార కార్యదర్శిగా సవారి సత్యం సగర, కార్యవర్గ సభ్యులుగా గుంటి రాములు సగర, యు. బాలస్వామి సగర, జి. మొగులయ్య సగర, బంగారు శ్రీనివాసులు సగర, మద్దిగట్ల వెంకటయ్య సగర, బూదూరు నారాయణ సగర, గౌరవాధ్యక్షులుగా సిజి గోవర్ధన్ సగర, సలహాదారులుగా పర్వతాలు సగర, ఏ.రవీందర్ సగర, పీజీ బుడ్డన్న సగర, న్యాయ సలహాదారులుగా బంగారు హనుమంతు సగర నియమితులయ్యారు.

మహబూబ్ నగర్ జిల్లా సగర సంఘం కార్యవర్గ విస్తరణ సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ సగర సంగం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here