మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం

  • నల్లగండ్ల హుడా కాలనీలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీబాట 

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నల్లగండ్ల హుడా కాలనీ లో ప్రజా సమస్యలపై బస్తీ బాట లో భాగంగా కాలనీలో సమస్యల గురించి ప్రజలను ఆరా తీశారు గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి నల్లగండ్ల హుడా కాలనీ వాసులు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా కాలనీలోని భూగర్భ డ్రైనేజి పైప్ లైన్, సీసీ రోడ్డు, తాగునీళ్లు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్పందిస్తూ సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్ లో మాట్లాడారు. కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం తమ కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామన్నారు. పక్కా ప్రణాళికతో భవిష్యత్తులో జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఎలాంటి సమస్య ఉన్న ఇబ్బంది పడకుండా తనని సంప్రదించాలని స్థానికులకు హామీ ఇచ్చారు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ సురేందర్, జి.హెచ్.ఎం.సి ఏఈ సునీల్, జలమండలి మేనేజర్ అభిషేక్ రెడ్డి, జిహెచ్ఎంసి వర్క్ ఇన్ స్పెక్టర్ విశ్వనాథ, హెచ్ఎండబ్ల్యుఎస్ వర్క్ ఇన్ స్పెక్టర్ మోహన్, ఎలక్ట్రికల్ సూపర్ వైజర్ పవన్, జిహెచ్ఎంసి సూపర్ వైజర్ రఘు, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు, జలేందర్ రెడ్డి, రంజిత్ పూరి, రంగస్వామి ముదిరాజ్, శ్రీధర్, హుడా కాలనీ వాసులు, అపార్ట్ మెంట్ వాసులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

నల్లగండ్ల హుడా కాలనీలో బస్తిబాటలో భాగంగా పర్యటిస్తున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నల్లగండ్ల హుడా కాలనీ వాసులు, అపార్ట్ మెంట్ వాసులతో మాట్లాడుతున్న కార్పొరేటర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here