సోనియా గాంధీ సూచించిన అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్… భారీ మెజారిటీతో గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని నెలకొల్పుదాం…

  • శేరిలింగంపల్లి బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
  • 2014 లో నమ్మి ఓటేస్తే శత్రువుల పంచన చేరిండు గాంధీ
  • ఆ ద్రోహిని 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టండి
  • తెలుగు తమ్ముళ్లకు రేవంతన్న సూచన
  • కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ జెండాల రెపరెపలు
  • జన సందోహంతో కిక్కిరిసిన సభ

నమస్తే శేరిలింగంపల్లి:  కాంగ్రెస్ వారసత్వం , నిజాయితీ గల జగదీశ్వర్ గౌడ్ ను కాంగ్రెస్ అభ్యర్థి గా భారీ మెజారిటీతో గెలిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా కొండాపూర్ ఆర్టీఓ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  సూచనల మేరకు శేరిలింగంపల్లి అభ్యర్థిగా జగదీష్ గౌడ్ ను ప్రకటించి ఒక కొత్త  సాంప్రదాయానికి తెరలేపామన్నారు.

జగదీశ్వర్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

జేరిపాటి జైపాల్ , రఘునాథ్ లు టికెట్ ఆశించి  రాకపోయినా.. మనసులో బాధ ఉన్నప్పటికి.. పార్టీ నిర్ణయాన్ని శిరాసావహించి ఇందిరమ్మ రాజ్యం రావడానికి సహకారం అందించారన్నారు.  అధికారంలోకి వచ్చాక వారిద్దరికీ సముచిత న్యాయం చేస్తామన్నారు. ఈ సభకు ఇండియా కూటమిలోని కామ్రేడ్ లు, టీడిపి శ్రేణులు, కార్యకర్తలు తరలి వచ్చి జగదీశ్వర్ గౌడ్ ను  ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే గాంధీ గురించి మాట్లాడుతూ పేరులోనే  గాంధీ ఉందనీ,   చేసేవన్ని కబ్జాలు,  దొంగ  బుద్దులే అన్నాడు.

ఆర్టీఓ వద్ద భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

విద్య , ఉపాధి అవకాశాలే  లక్ష్యంగా ఏర్పడ్డ  ఈ రాష్ట్రంలో భూములు ఆక్రమించుకొని ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిండన్నారు. అలాంటి ద్రోహి గాంధీని 100 మీటర్లు గోతి తీసి పాతిపెట్టాలని తెలుగు తమ్ముళ్లకు సూచించారు. బీహెచ్ఈఎల్ ఏర్పడప్పుడు 200 ఎకరాలు జగదీశ్వర్ గౌడ్  చిన్నాన్న, కేంద్రమంత్రి స్వర్గీయ మల్లిఖార్జున్ కోల్పోయాడని అలాంటి వారసత్వం , నిజాయితీ గల కుటుంబం నుంచి వచ్చిన జగదీష్ కు మీ మద్దతును ఇచ్చి మంచి మనసున్న జగదీశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఉద్యమ సమయంలో నిఖర్శాయిన నిరుద్యోగ యువకులు సమిధలయ్యారన్నారు.

  • వేల ఎకరాలు ఆక్రమించిండు

కేసీఆర్  కుటుంబం అందరికీ ఉద్యోగాలు వచ్చినయన్నారు. కేసీఆర్ అనే బక్కోన్ని పట్టుకొని కాంగ్రెస్ వాళ్లు ఎదురు దాడి చేస్తున్నాం అంటున్నారు. బక్కొనికి ఏమీ కావాలి రెండు బుక్కల బువ్వనే ..కానీ ఆయన మేడ్చల్ జిల్లాలో 10 వేల ఎకరాల భూములు ఆక్రమించిన బూబకాసురుడు. శేరిలింగంపల్లి అభ్యర్థి గా జగదీష్ ను ఎమ్మేల్యే గా గెలిపిస్తే బరాబర్ గా తానే సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

జనసందోహంతో కిక్కిరిసిన సభా ప్రాంగణం
  • అధికారంలోకి వస్తే అన్నివర్గాలకు మేలు

అధికారంలోకి వస్తే అన్నివర్గాలకు మేలు జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. మహాలక్ష్మి మొదటి తారకు 2 వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు.  ఆనాడు సోనియమ్మ కట్టెల పొయ్యి ఇస్తే.. వచ్చేనెల కేసీఆర్ ను బొంద పెడితే 500 సిలిండర్, ఆర్టీసి బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి కింద లక్ష నగదు తోపాటు తులం బంగారం ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. 24 గంటల గృహవసరాలకు ఉచిత విద్యుత్, పేద పిల్లల చదువులకు 5 లక్షల బ్యాంకుకు గ్యారంటీ. మధ్యతరగతి సొంతింటి కల 5 లక్షలు, వచ్చే నెల నుంచి రూ. 4 వేల పెన్షన్ ఇచ్చే బాధ్యత తమదే అన్నారు. సెక్రటేరియట్ నిర్మాణంలో పవిత్రమైన మజీద్ ను తొలగించిన ఘనత కేసిఆర్ దేనన్నారు.

  • శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ గాలి వీస్తుంది : జగదీశ్వర్ గౌడ్ 

శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ గాలి వీస్తుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. నవరత్నాలు అయిన భేల్ కంపనీ వచ్చినది కేవలం నెహ్రూ, ఇందిర వల్లనే అన్నారు. అలాంటి నాయకత్వ వారసులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో 6 గ్యారంటీ లతోపాటు గెలుపు ఖాయం అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకి ఎమ్మేల్యే గా గెలిచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here