కమలానికి ఓటేసి గెలిపించండి : బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్ 

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ , మై హోం నవదీప కమ్యూనిటీ ఆధ్వర్యంలో బిజెపి కి మద్దతుగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు.

మై హోం నవదీప కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలు వారి దృష్టికి తీసుకురాగా గెలిచిన వెంటనే పరిష్కరించి తీరుతామని హామీ ఇచ్చారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ నెల నవంబర్ 30వ తారీకున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీ గెలిపించాలని కోరారు.

సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here