నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకులో స్థానిక నాయకులు, ప్రజలతో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ బస్తీ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ప్రేమ్ నగర్ ఏ బ్లాకులో రూ. కోటి 22 లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న అంతర్గత రోడ్ల పనులను పర్యవేక్షించారు. ప్రతి వీధి వీధి తిరుగుతూ, నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొన్నారు.
గడిచిన 8 సంవత్సరాలనుండి చేసిన అభివృద్ధికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కొన్ని చోట్ల మిగిలిన రోడ్లను త్వరిత గట్టిన పూర్తి చేసి, బస్తీల రూపురేఖలను మార్చి, ఆదర్శ డివిజన్ గా కొండాపూర్ డివిజన్ను మారుస్తానని అన్నారు. ప్రేమ్ నగర్ ఏ బ్లాకులో ఎత్తు మీద ఉన్న ఇళ్లకు సరైన విధంగా మంచినీటి సరఫరా జరగటం లేదని ప్రజలు కార్పొరేటర్ హమీద్ పటేల్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా బస్తీలో 20 వ వీధి నుండి 25 వ వీధి వరకు ఎత్తు మీద ఉన్న ఇళ్ల ప్రాంతాన్ని పర్యవేక్షించి, ఒక వాటర్ బూస్టర్, రెండు వాటర్ వాల్స్ లను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించటం వాటర్ బోర్డు అధికారులను ఆదేశించారు.
కొన్ని వీధుల్లో కావాల్సిన వీధి దీపాల స్థంబాలు, ఎలక్ట్రికల్ స్థంబాలు గురించి వివరంగా తెలుసుకొని, త్వరిత గతిన చర్యలు చేపట్టి, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత ఎలక్ట్రికల్ అధికారులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఉస్మాన్, షేక్ ఇమామ్, గిరి గౌడ్, సయ్యద్ అమీనుద్దీన్, జహీర్, షేక్ ఫరిఖ్, వహీద్ అలీ, జహంగీర్, అభి అక్షయ్ ఉన్నారు.