ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

  • ప్రభుత్వ విప్ గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ కాలనీ లో రూ. 50 లక్షల అంచనా వ్యయంలో చేబట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిలుగా పాల్గొని శంకుస్థాపన చేశారు.

సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

ఈ సందర్భంగా కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ కాలనీలను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. సమస్యలను ఒక్కొకటిగా అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా ఆదర్శవంతమైన గచ్చిబౌలి డివిజన్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతీ బస్తీ, కాలనీల్లో కోట్ల నిధులు వెచ్చించి మంచినీరు, రోడ్లు, కరెంటు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.

కార్పొరేటర్ కు సన్మానం

మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని , ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో డీఈ విశాలాక్షి, ఏఈ సునీల్, గుల్మొహర్ పార్క్ అధ్యక్షులు ఖాసీం, గుల్మొహర్ పార్క్ కార్యదర్శి నిరంజన్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, నరసింహ రావు, శ్రీధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నేతాజీ నగర్ కాలనీ ఉప అధ్యక్షులు రాయుడు కాలనీ వాసుల, స్థానిక నేతలు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here