ప్రజల వద్దకే పాలన కోసం సమీక్ష

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల వద్దకే పాలన అనే గొప్ప ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి జోనల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జెడ్ సి శంకరయ్య, నోడల్ అధికారి, డిసి వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , తదితర డివిజన్ కార్పొరేటర్ లు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు

వార్డు కార్యాలయాల్లో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందించే దిశగా జిహెచ్ఎంసి ప్రతి డిపార్ట్మెంట్ నుండి అందుబాటులో ఉంటు పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిహెచ్ఎంసి అధికారులు, నూతన వార్డ్ కార్యాలయ సభ్యులు, గోపాల్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here