కాంగ్రెస్ గెలుపునకు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నరు : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : లింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి కాలనీలో కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ రోడ్డు షోతో పాటు బైక్ రాలీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళామణులు మంగళాహరతులు పట్టి ఘన స్వాగతం పలికారు.

మంగళహరతులు పట్టి స్వాగతం పలుకుతున్న మహిళామణులు

అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు ప్రజలలో మంచి స్పందన లభిస్తుందని, స్వచ్చందంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని ముక్త కంఠంతో తెలియజేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు.

పెద్ద ఎత్తున జనం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here