- రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు హాఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో కన్నులపండువగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వ విప్ గాంధీ అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు చెప్పారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నియోజకవర్గంలోని ప్రతి గుడికి బోనాల నిధులు మంజూరయేలా కృషి చేశానని, బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మనోహర్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.





