భళా “ధీర”జ్..

  • ఐసిఎస్ఈ, సీఐఏస్ఈ తెలంగాణ స్విమ్మింగ్ పోటీల్లో హెచ్ పి ఎస్ విద్యార్థి అద్భుత ప్రతిభ
  • కె.ధీరజ్ కుమార్ కు ఐదు పసిడి పతకాలు

నమస్తే శేరిలింగంపల్లి: ఐసిఎస్ఈ, సీఐఏస్ఈ తెలంగాణ స్విమ్మింగ్ పోటీల్లో బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి సత్తా చాటాడు. హెచ్ పీ ఎస్ బేగంపేట్ లో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పలు స్కూళ్ల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే హెచ్ పి ఎస్ బేగంపేట లో విద్యనభ్యసిస్తున్న 8వ తరగతి విద్యార్థి కె.ధీరజ్ కుమార్ ఈ పోటీల్లో పాల్గొని తన అద్భుత ప్రదర్శనతో 3 స్వర్ణ పతకాలు సాధించాడు.

ధీరజ్ కుమార్

100 మీ బ్రెస్ట్ స్ట్రోక్, 200 మీటర్లు బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగాలలో ధీరజ్ ప్రతిభతో తెలంగాణకు మూడు పసిడి పతకాలు తెచ్చి పెట్టడం విశేషం. అదేవిధంగా అండర్-14 రిలే విభాగంలో మరో రెండు పసిడి పథకాలను సాధించాడు. ఈ క్రమంలోనే సిఐఎస్ సిఈ నిర్వహించే అండర్ 14 విభాగం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా హెచ్ పి ఎస్ యాజమాన్యం, తోటి విద్యార్థులు ధీరజ్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అతడి కోచ్ ను, తల్లితండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here