నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జనని రావు కూచిపూడి నృత్య ప్రదర్శనలో గణేశా కౌతం, రుక్మిణి ప్రవేశం, బ్రహ్మమొక్కటే అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
వరంగల్ నుండి విచ్చేసిన కూచిపూడి నాట్య గురువులు తాడూరి రేణుక శిష్య బృందం (సాయిచరణ్, రాధికా, రిషిత, విలసిని, బ్రామరీ, అద్వైత, అవని, ఆరాధ్య, నిశిత, వరాళిక) కూచిపూడి నృత్య ప్రదర్శనలో ఆనంద నర్తన గణపతిమ్, బ్రహ్మాంజలి, మహాగణపతిమ్, ఇదిగో భద్రాద్రి, గజవదన బెదువే, జనుత శబ్దం, అన్నమాచార్య కీర్తనలు, లింగాష్టకం, కాలభైరవాష్టకం, శంకర శ్రీగిరి, అయిగిరినందిని మొదలైన అంశాలను ప్రదర్శించారు. బి. ఎం. రెడ్డి నటులు, దర్శకులు, నెల్లుట్ల ప్రవీణ్ చందర్ లు విచ్చేసి కళాకారులకు నాట్య రత్న, నాట్య బాల పురస్కారాలు ఇచ్చి సత్కరించారు.