రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టండి

  • తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ ని కలిసి వినతిపత్రం అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అశోక్ యాదవ్ రాష్ట్ర ముఖ్య సలహాదారి బేరి రామచందర్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా పూల బొకేతో ఘనంగా సన్మానించి వినతి పత్రం అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ ని కలిసి వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

అనంతరం వారు మాట్లాడుతూ .. రెక్కడితే కానీ డొక్కాడని గొర్రె కాపరులు తాళిబొట్లు కుదువ పెట్టుకుని అప్పులు తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో 1,07,000 మంది గొర్రె కాపరులు డీడీలు కట్టి 18 నెలల గడించింది, గత రాష్ట్ర ప్రభుత్వం 35,150 మందికి ఇచ్చి ఆపివేసిందని, ఇంకా 71,850 మంది గొర్రె కోసం ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గొర్రె కాపరుల ఆవేదనని దృష్టిలో పెట్టుకుని స్పందించి గొర్రెలు కాపరులకు ఎన్ సి డి సి నాబార్డ్స్ లోన్స్ కేంద్ర ప్రభుత్వం సహకారం సంఘల ద్వారా నైనా గొర్రెల కాపరులకు నగదు బదిలీ చేసి తగిన న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభపతి గడ్డం ప్రసాద్ సానుకూలంగా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి డీడి డబ్బులు కట్టిన గొర్రె కాపరులకు తగిన న్యాయం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చెగొండ రాజన్న యాదవ్, అందాల కుమార్ యాదవ్, గట్టు మహేష్ యాదవ్, సతీష్ యాదవ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు రామాంజి యాదవ్ , బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాయన్న ముదిరాజ్, అంజిత్ యాదవ్, పెద్దరాజుల మధు డైరెక్టర్, మందమర్రి మండల నాయకులు సంధిని వేణి మల్లేష్ యాదవ్ చిట్టి వేణి కొమురయ్య యాదవ్ అమర గాని ఉమేష్ యాదవ్ పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here