- ఎంఏ నగర్ కాలనీలో పాదయాత్ర చేపట్టిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కాలనీలోని పలు సమస్యల పరిష్కారానికి, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై పలు శాఖల సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు, కాలని వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కాలనీ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, కాలనీలలో నూతనంగా నిర్మాణం చేపట్టబోయే మంజీర వాటర్ లైన్, యూజిడి, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ సునీత, వర్క్ ఇన్ స్పెక్టర్స్ నవీన్, లింగయ్య, స్థానిక నాయకులు రవి గౌడ్, రాజు గౌడ్, విజయ్ ముదిరాజ్, శివ ముదిరాజ్, జంగం మల్లేష్, రాములు, నారాయణ, రాజు, నర్సింహులు గౌడ్, ప్రబు, అల్లావుద్దీన్, సంతోష్, అవినాష్, చిరు , కిరణ్, పాల్గొన్నారు.