నమస్తే శేరిలింగంపల్లి: సకల జనుల అభివృద్ధి.. బిజెపితోనే సాధ్యమని ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి అన్నారు. శేరిలింగంపల్లిలో బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్ అధ్వర్యంలో చేపట్టిన రోడ్ షో కు పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ ర్యాలీ భారీ జనసందోహం మధ్య సాగింది. ప్రజలు, బిజెపి శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలో కమలం జెండా ఎగరడం ఖాయమన్నారు. 30న జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీకే ఓటేసి రవికుమార్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
