నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, స్టాలిన్ నగర్, కృషినగర్ కాలనీలలో, పలు అపార్ట్ మెంట్లలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ కుమార్తె హారిక గౌడ్ తో కలిసి స్థానిక నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఐఎన్ టిసి నాయకులు, మహిళా సోదరిమణులు కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.