- గడపగడపకు బిజెపి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్
- 20వ రోజుకు చేరిన రవన్న ప్రజా యాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: కూకట్ పల్లి వివేకానంద నగర్ డివిజన్ లోని వెంకటేశ్వర నగర్ కాలనీలో గడపగడపకూ బిజెపి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆనాడైనా, ఈనాడైనా ప్రజలకు అందుబాటులో ఉండేది.. ఉంటుంది తామేనని, అధికారం ఉన్నా, అధికారం లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ఎనలేని పోరాటం చేస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలోనూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఎంతోమందికి సహాయ సహకారాలు అందించామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విఫలం వల్ల ఎంతోమంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. పాదయాత్రలో చాలామంది బాధితులు తమ వద్దకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నర్సింగరావు, కంటెస్టెడ్ కార్పొరేటర్ కల్పన ఏకాంత గౌడ్, శ్రీనివాస్ గౌడ్, గోపాల్ రావు, శ్రీహరి యాదవ్, రాజు, మనోజ్, తిమ్మయ్య, గణేష్ గౌడ్, బొట్టు శీను, జితేందర్, శీను, కనకయ్య, మమత, రేణుక, జయశ్రీ, శాలిని, కళ్యాణ్, విష్ణు, గణేష్, విష్ణు పాల్గొన్నారు.
