నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో వీది కుక్కల నుండి ప్రజలను రక్షించాలని ఏఐఎఫ్ డివై ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్ డివై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనింగ్ కమిటీ సభ్యులు కె షరీష్, ఇ.దశరథ్ నాయక్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని కాలనీలో, బస్తీలలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, వాటి నుంచి ప్రజలను రక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో నగరంలోని అంబర్ పేటలో చోటు చేసుకున్న సంఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. వీధి కుక్కల బారిన పడకుండా ప్రజలకు తగిన అవగాహన కార్యక్రమాలను అధికారులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందిస్తున్న ఏఐఎఫ్ డివై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనింగ్ కమిటీ సభ్యులు