‘బస్తీ నేస్తం’ పై అవగాహన 

  • హాజరైన బస్తీ చిన్నారులు 
  • ఆరోగ్యాభివృద్ధి, నేరాల పై మాదాపూర్ పోలీసుల అవగాహన 
ఆరోగ్యాభివృద్ధి, నేరాల పై అవగాహన కల్పిస్తున్న దృశ్యం 

నమస్తే శేరిలింగంపల్లి: ‘బస్తీ నేస్తం’ ఇనిషియేటివ్ పేరిట మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓంకార్ నగర్ స్లమ్ ఏరియాలోని బస్తీ పిల్లలు పాల్గొని ఆటలు, సాంస్కృతిక కార్యక్రమంలలో మునిగి తేలారు. ఈ సందర్భంగా పిల్లలకు ఆరోగ్యాభివృద్ధి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, మహిళలపై నేరాలు, బాల్య నేరాల వంటి విషయాలపై అవగాహన కల్పించారు. డెంటల్, ఆప్టోమాలజీ, డెర్మటాలజీ మరియు జనరల్ ఫిజీషియన్స్ వంటి వైద్యుల బృందంతో హెల్త్ క్యాంపు కూడా నిర్వహించారు. మొత్తం 150 మంది పిల్లలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. డిసిపి మాదాపూర్ మేడం, వినయ్ వంగల (పరివర్తన్ పరివార్), కౌముది (లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్), సునీష (అమృత ఫౌండేషన్) హాజరయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here