నమస్తే శేరిలింగంపల్లి: వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధి చేస్తున్నామన్న స్థానిక కార్పొరేటర్, స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిపై శ్వేత పత్రం ప్రజల ముందుంచాలని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి డివిజన్ హనుమాన్ నగర్, దీనబంధు కాలనీలో స్థానిక నాయకులతో కలిసి గడపగడపకు తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమాన్ నగర్, దీనబంధు కాలనీలో గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి జరిగింది తప్ప ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధిని కుంటుపరుస్తూ అవినీతి పెంచి పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పర్వతాలు యాదవ్, శ్రీహరి, గోవర్ధన చారి, శ్రీనివాస్ పటేల్, వెంకటేష్, శ్రీధర్ పటేల్ , గోపాల్ రావు , బాలు యాదవ్, శ్రీకాంత్ యాదవ్ , లోకేష్, కామరాజు రమేష్ యాదవ్ , అప్పారావు, నరేష్, సాయి, విజయ్ కుమార్, మహేందర్, శ్రీలత, అరుణ, సుకన్య, లక్ష్మి, మణెమ్మ, సంధ్య, రేణుక పాల్గొన్నారు.