నమస్తే శేరిలింగంపల్లి: ప్రకృతి సహజ సిద్ధమైన వనరులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్ లోని ఫార్చ్యూన్ టవర్స్ లో ఏర్పాటు చేసిన 250 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ ని తెలంగాణ రాష్ట్ర శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి, రెడ్కో వైస్ చైర్మన్&ఎండీ జానయ్య తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తరిగిపోతున్న వనరుల తరుణంలో సహజ సిద్దమైన సౌర శక్తిని వాడుకొని సద్వినియోగం చేసుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని, 250 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేసిన మొట్టమొదటి గేటెడ్ కమ్యూనిటీ ఇదే కావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు.
ఫార్చ్యూన్ టవర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఫార్చ్యూన్ టవర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాగంటి సత్యనారాయణ గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారు, ట్రెజరర్ రామారావు గారు, విజయకుమార్.. ఫార్చ్యూన్ టవర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, రెడ్కో అధికారులు పాల్గొన్నారు.