నమస్తే శేరిలింగంపల్లి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చందానగర్ శ్రీ శారదా పీఠపాలీత వెంకటేశ్వర దేవాలయ సముదాయంలో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. 12వ తేదీన వేదం మంత్రోచ్ఛరణల నడుమ సంకల్పము, విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం నిర్వహించారు. శుక్రవారం ఉదయం 9:00 దీక్షాధారణ, సర్వదేవతా ప్రార్థన, అకల్మష హోమంతో మొదలై సాయంత్రం 5:00 గంటలకు మృత్స్య గ్రహణం( పుట్టమన్ను తెచ్చుట) అంకురార్పణ, వాస్తుపూజ, అగ్నిమధనం, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణ ప్రధాన హోమములు నిర్వహించారు. రాత్రి 9:00 గంటలకు హారతి తీర్థప్రసాదాలు అందించారు. ఈ పూజ కార్యక్రమాలు దేవాలయ ఉపాధ్యక్షుడు, జూబ్లీహిల్స్ టర్బో మిషనరీ ఇంజినీరింగ్ ఎం డి తోటసుబ్బారాయుడు, బాల సురేష్బాబు, చందన ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.