- రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
- గడపగడపకు బిజెపి కార్యక్రమంలో డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ వీకర్ సెక్షన్, మాధవరం కాలనీలో గడపగడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మొన్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలలో పబ్లిక్ కాంటాక్ట్స్ పేరుతో 15 శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రణాళికలు వేసుకున్నారు కానీ, ఈ సమావేశంలో వస్తున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో వెళ్లి అధికారులు నేతలు పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తున్నారా, ఇప్పటివరకు ఎన్ని సమస్యలు పరిష్కరించారో పత్రిక ప్రకటన ద్వారా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. వివేకానంద నగర్ డివిజన్ లోని శాంతినగర్, రామకృష్ణ నగర్ లో కాలనీలలో కొన్ని ఇండ్లలో నీటి సరఫరా సరిగ్గా జరగడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అదేవిధంగా, రిక్షా పుల్లర్ కాలనీ, రామకృష్ణ నగర్ లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఎందుకు పరిష్కరించడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నరసింగరావు, కంటెస్టెడ్ కార్పొరేటర్ విద్యా కల్పన ఏకాంత గౌడ్, గోపాలరావు, శ్రీహరి యాదవ్, మనోజ్, రేపాన్ రాజు, గణేష్, తిమ్మయ్య ముత్యాలు, జితేందర్, శ్రీనివాసు, బుల్లెట్ శీను, అశోక్ , లలిత రెడ్డి, మమత రేణుక, శాలిని, సంధ్య పాల్గొన్నారు.