వాడవాడల్లో ఘనంగా బిఆర్ఎస్ జెండా పండుగ

  • పార్టీ జెండాను ఆవిష్కరించిన కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్
పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అనేక బస్తి/కాలనీలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్. అనంతరం ఓల్డ్ హాఫీజ్ పెట్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద హాఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జెండాను ఆవిష్కరించారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్. అనంతరం మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ చౌరస్తా, హరిజన బస్తి, ఖానామేట్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బలింగ్ యాదగిరి గౌడ్, ఈ.శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ గౌస్, మధుసూదన్ రెడ్డి, లక్ష్మ రెడ్డి, వాలా హరీష్ రావు, సహదేవ్, సాంబయ్య, గోపాల్ నాయక్, అర్జున్, శేఖర్ ముదిరాజ్, రవి కుమార్ పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here