- ప్రభుత్వానికి విన్నవించిన జనసేన పార్టీ
నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయి.. శిథిలావస్త స్థితికి చేరి భయాందోళన కలిగిస్తున్నాయి.. కనీస వసతులు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇది మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. ఈ పాఠశాలను జనసేన శేరిలింగంపల్లి కో ఆర్డినేటర్ మాధవరెడ్డి , సభ్యులు ఇటీవల సందర్శించి స్కూల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పలు సమస్యలను గుర్తించారు. ఆ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించగా.. కనీస వసతులలేమి, తరగతి గదులు, టాయిలెట్స్, తాగునీరు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు కూడా లేవని తెలిసిందని చెప్పారు. ఫీజుల తగ్గింపు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో ను ప్రైవేట్ పాఠశాలలు పాటించడం లేదని, ఫలితంగా మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపించే స్తొమత లేక, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ స్పందించి అధ్వాన్న స్థితిలో ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేసి, పాఠశాలల్లో అధిక ఫీజులు వాసులు చేసే పాఠశాలలపై చర్యలు చేపట్టాలని యాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో చందానగర్ డివిజన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, , జన సైనికులు ద్రక్ష్యాని, సందీప్ కసెట్టి, సూర్య, శ్రవణ్, రాజగోపాల్, అశోక్ ,రవి కుంచల, సాయి సతీష్, కార్తిక్ పాల్గొన్నారు.