నమస్తే శేరిలింగంపల్లి: కుల, మత, ధనిక, పేద, వర్గ విభేదాలు చూపుతూ సంపన్న వర్గాల వారికే పెద్దపీట వేస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పి ప్రజా పాలన తీసుకురావాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. అభివృద్ధి కుంటుపడటంతో అమ్మానాన్న లేని ఓ అనాధగా నియోజకవర్గం మిగిలిపోయిందన.. గత ప్రభుత్వాల హాయంలో స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్ చేసిన అభివృద్ధి ప్రజా ఆదరణ పొందిన వ్యక్తులుగా వారు మిగిలిపోయారని.. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఒక వర్గానికి.. ఒక ప్రాంతం వారికి ప్రాధాన్యత ఇస్తూ స్థానికులను చిన్న చూపు చూస్తూ స్థానికేతరులకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు.
గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో భాగంగా హఫీజ్ పెట్ డివిజన్ శాంతినగర్ లో గడపగడపకు బిజెపి కార్యక్రమాన్ని చేపట్టారు. పాదయాత్రలో అనేక సమస్యలను గుర్తించి ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం అభివృద్ధిని మరిచి కంచె చేను మేసినట్టుగా వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ 3 నెలల్లో భారత జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవాల్ యాదవ్, ఆదిత్య ,మన్యం, అజయ్, శ్రీను, రాజు యాదవ్, అర్జున్, శివ ముదిరాజ్, యాదగిరి, మహేష్, సాయి పాల్గొన్నారు.