ఇషాన్ రెడ్డి ధాటికి హైదరాబాద్ టైటన్స్ విలవిల 

  • 182 పరుగులకు హైదరాబాద్ టైటాన్స్ ఆలాౌట్
  • 5వికెట్లు..48 పరుగులతో చెమటలు పట్టించిన ఇషాన్ రెడ్డి
  • హెచ్ సిఏ బి డివిజన్ రెండు రోజుల లీగ్ మ్యాచ్ లో సాయి సత్య గెలుపు

నమస్తే శేరిలింగంపల్లి : హెచ్ సిఏ బి డివిజన్ రెండు రోజుల లీగ్ 2023-24 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో సాయి సత్య, హైదరాబాద్ టైటాన్స్ మధ్య పోటీ రసవత్తరంగా సాగింది.

అంతకుముందు టాస్ గెలిచిన హైదరాబాద్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలో దిగిన ఆ జట్టు సాయిసత్య జట్టు ఆటగాడు ఇషాన్ నారాయణ్ రెడ్డి బౌలింగ్ ధాటికి విలవిలలాడింది. 182 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనిరుధ్-82, ప్రేరిత్ రెడ్డి- 58 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్యాన్ని చేదించేందుకు బరిలో దిగిన సాయి సత్య జట్టు 7 వికెట్లు కోల్పోయి.. 186 పరుగులు చేసి విజయం సాధించింది. ఆరుష్ పరుచూరి-37, పి ఇషాన్ రెడ్డి- 5 వికెట్ల తీయడంతో పాటు 48 పరుగులు చేసి సునాయాసంగా తమ జట్టును గెలిపించాడు.

మొదట బౌలింగ్ లో 5 వికెట్లు తీసి ప్రత్యర్ధులకు చెమటలు పట్టించాడు. అనంతరం బ్యాటింగ్ లో 48 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు పి ఇషాన్ రెడ్డి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here