నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ పరిధి సుమిత్ర నగర్ లో చైతన్య నగర్ వినాయక యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని కార్పొరేటర్ రోజాదేవి రంగరావుతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం చల్లని మజ్జిగను కాలనీ వాసులకు, బాటసారులకు అందచేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నగరంలో రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రజలు ఎండలకు నీళ్లకు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్బంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులను, చైతన్య నగర్ వినాయక యూత్ అసోసియేషన్ ని ప్రత్యేకంగా అభినందించారు. అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, చంద్రమోహన్ సాగర్, వి. నరసయ్య, సిహెచ్ బాలరాజు, నర్సింహ చారి, అనిల్, వేణు, కృష్ణం రాజు, మారయ్య, శంకర్, శ్రీనివాస్, ప్రవీణ్, మురళి, కృష్ణ రావు, జగదీష్, చైతన్య నగర్ వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.