- రాంకీ సంస్థ ప్రతినిధులతో ఎమ్మెల్యే గాంధీ సమీక్షా సమావేశం
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పారిశుధ్య పనుల నిర్వహణ సమస్యలపై, భవన నిర్మాణాల వ్యర్థాల తరలింపుపై రాంకీ సంస్థ ప్రతినిధులతో వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ పారిశుధ్య పనుల నిర్వహణపై అలసత్వం ప్రదర్శించకూడదని, అలసత్వం ప్రదర్శిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. కాలనీలలో పేరుకుపోయిన చెత్తకుప్పలు తొలగించడంలో రాంకీ సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పారిశుధ్యం పనులు కుంటపడటం పై ఎమ్మెల్యే గాంధీ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు.
రాంకీ సంస్థ ఉద్యోగులకు అనుభవం లేకపోవడం, సరైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోవడంపై జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. భవన నిర్మాణాల వ్యర్థాల తరలింపు ట్రాక్టర్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని, వారికి తగిన న్యాయం చేయాలని, చెత్తకుప్పలు పేరుకుపోకుండా చూడాలని, జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది, రాంకీ సంస్థ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి పారిశుద్ధ్య పనులు నిర్వహణలో అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రతి కాలనీని స్వచ్ఛ కాలనీగా తీర్చిదిద్దాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రాంకీ సంస్థ ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ హరికృష్ణ, వైస్ ప్రెసిడెంట్ సత్య, భూపాల్ రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.