- పూజలు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : మదినగూడలోని రామకృష్ణ నగర్ హరిహర క్షేత్రం 12వ వార్షికోత్సవo వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్రీ సుదర్శన హోమము, మధ్యాహ్నం ఒంటిగంటకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రము 6 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామివారి శోభాయాత్ర నిర్వహించారు.