నమస్తే శేరిలింగంపల్లి : అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో ప్రతి శనివారం జరిగే అన్నమ స్వరార్చన, నృత్యార్చన కార్యక్రమంలో ఈ శనివారం శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి నృత్యార్చన జరిగింది. మొదట శోభా రాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతితో ప్రారంభించారు. అనంతరం సాయి సన్నిధి కూచిపూడి డాన్స్ అకాడమీ గురువు రాధిక , వారి శిష్యులు అన్నమయ్య కీర్తనలకు తమ నృత్య కైంకర్యంతో అందరి మన్ననలు పొందారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు “గణేశ పంచరత్నం, ముద్దుగారే యశోద, మరి తన భోగములు మాయ విలాసములు, వినుడిదే రఘుపతి విజయ్ అమ్యూస్మెంట్, గుర్రాల, నీవు మొదలి జానవు, కొంగువట్ట కంట నీవు, సురలకు నరులకు, శ్రీ వేంకటేశ్వరుడున్నాడు, అతివరో, వంటి సంకీర్తనలకు వి.తన్మయి శ్రీ, బి. వి. ఎస్. ఎస్. ప్రణతి, జి. దివ్యశ్రీ, జి. క్రిష్టి, తన్విశ్రీ, ఉష సాయి, అవంతిక, ప్రజ్వల, కే. ప్రణవి సహస్ర, రితు వర్మ తమ నృత్య ప్రదర్శనతో అందరిని అలరించారు. తదనంతరం కళాకారులను సంస్థ నిర్వాహకులు శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.