- ఏ ఐ ఎఫ్ డి డబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య
నమస్తే శేరిలింగంపల్లి: మహిళలపై జరుగుతున్న దాడులను, హింసను నివారించాలంటే మనువాద పాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని ఏఐఎఫ్ డి డబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నుండి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా మనువాద-ఫాసిజానికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాలి” అనే అంశం పైన శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ స్టాలిన్ నగర్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

మానవ సమాజ చరిత్రలో భారత తాత్విక అంశంలో బ్రాహ్మణిజం మహిళను వంటింటి కుందేలుగాను, ఎలాంటి హక్కులకు నోచుకోని విధంగా పురుషునికి సేవ చేసే బానిసగా చేసి పెట్టిందని అన్నారు. వందల సంవత్సరాలుగా ఇప్పటికీ స్త్రీ హింసకు, అత్యాచారాలకు, హత్యలకు గురి అవుతూ వస్తున్నదని ఆరోపించారు. పి.భాగ్యమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డిడబ్ల్యు రాష్ట్ర కోశాధికారి తాండ్ర కళావతి, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అంగడి పుష్ప, గ్రేటర్ హైదరాబాద్ నాయకురాలు బి విమల, టి పుష్పలత, బి రాణి, అనిత, ధారా లక్ష్మి, జయలక్ష్మి, విజయ, ఏఐఎఫ్ డి వై గ్రేటర్ హైదరాబాద్ యువతల విభాగం కన్వీనర్ ఎండి సుల్తానా, జి శివాని, రాజశ్రీ, వి.తుకారం నాయక్, తుడుం అనిల్ కుమార్ మాట్లాడారు. కర్ర దానయ్య, కన్న శ్రీనివాస్, పల్లె మురళి, లలిత, టీ.నర్సింగ్, ఏ దుర్గాప్రసాద్, మహేష్ పాల్గొన్నారు.
